చాలామందికి కాళ్లు, చేతుల్లో ఉండే నరాలు మంటగా ఉంటున్నాయి అంటున్నారు..ఈ మంటలు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి… ఈ వ్యాధినే పెరిఫిరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా వారు నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి కలుగుతుంది. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బతినడం వల్ల…