Nepal Plane Crash: 18 మంది చనిపోయినా, పైలెట్ మాత్రం అద్భుతంగా బయటపడ్డాడు.. ఎలా సాధ్యమైంది..
- నేపాల్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన పైలెట్..
- 18 మందిని బలితీసుకున్న.. మృత్యుంజయుడిగా నిలిచిన శక్యా..
- ఎలా సాధ్యమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Flight crash: నేపాల్‌లో నిన్న జరిగిన భయంకర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. అయితే, అనూహ్యంగా ఈ ప్రమాదంలో ఒక్క పైలెట్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కెప్టెన్ మనీష్ రాజ్ షాక్యా ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలాడు. అంతటి ఘోర విమాన ప్రమాదంలో పైలెట్ ప్రాణాలతో ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also: Tata Curvv EV: అదిరిపోయిన టాటా కర్వ్ EV ఇంటీరియర్, ఫీచర్లు.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
సౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోంబార్డియన్ CRJ-200 విమానం, 19 మంది సిబ్బందితో సహా, ఇద్దరు సిబ్బంది, ఎయిర్‌లైన్‌లోని సాంకేతిక సిబ్బందితో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. మృతుల్లో 15 మంది అక్కడిక్కడే మరణించగా, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్ ఉన్న కాక్‌పిట్ భాగం ఓ కంటైనర్‌ని ఢీ కొట్టింది. కాక్ పిట్ కంటైన్‌లో చిక్కుకుని, మిగతా విమానభాగాలు వేరై నేలపై పడి మంటలు అంటుకున్నాయి. 37 ఏళ్ల షాక్యాని కంటైనర్ లోపల గుర్తించారు. ఇదే అతడి ప్రాణాలను కాపాడింది.
ప్రస్తుతం షాక్యా ఖాట్మాండు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. అతడి మెదడులో గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. వెన్నుముక రెండు ప్రాంతాల్లో విరిగినట్లు వైద్యులు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి బుధవారంతో పోలిస్తే గురువారం మెరుగైనట్లు వెల్లడించారు. షాక్యా మంటల్లో కాలిపోనప్పటికీ, పలు ప్రాంతాల్లో ఎముకలు విరిగినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి అతను పూర్తిగా బయటపడ్డాడని, మాట్లాడగలడని, ద్రవాహారాన్ని తసుకోవచ్చని వైద్యులు చెప్పారు.
#nepalcrash kills 18; captain survives
A small passenger plane of Nepal's @SauryaAirlines crashed and caught fire while taking off from #Kathmandu, killing 18 people on board and leaving one survivor, the captain.@Reuters
@x/JacdecNew@skynews @TOIIndiaNews @indianexpress pic.twitter.com/6tuGcO6Hki— Slayer of Cheats (@vi_shukla) July 24, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!