Ex-Prime Minister of Nepal’s Controversial Comments on India: భారత్ సన్నిహిత దేశం నేపాల్. ఇరు దేశాల మధ్య శతాబ్ధాల సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో నేపాల్ కు అండగా నిలుస్తోంది భారత్. అయితే నేపాల్ మాజీ ప్రధాని మాత్రం భారతదేశంపై ఎప్పుడూ తన అక్కసు వెళ్లగక్కతుంటాడు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్ తమవిగా చెబుతున్న భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని శుక్రవారం అన్నారు. నేపాల్-భారత సరిహద్దుల్లోని పశ్చిమ నేపాల్ దర్చులా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అధికారంలో వస్తే భారత్ లోని కాలాపానీ, లిపియాధురా, లిపులేక్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ అన్నారు.
Read Also: Police Statement: పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి రెక్కీ చేయలేదు… కుట్ర జరగలేదు..!!
నేపాల్ భూభాగాన్ని అంగుళం కూడా వదలబోమని..దౌత్యం కార్యక్రమాల ద్వారా, పరస్పర సంబంధాల ద్వారా నేపాల్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని నేపాల్ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా అన్నారు. పశ్చిమ నేపాల్ లోని దదేల్ ధురా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో నేపాల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమగ్రతను ఎన్నికల ఎజెండాగా చేసుకోవద్దని మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారామ్, ఓలీని కోరారు.
గతంలో ప్రధానిగా కేపీ శర్మ ఓలీ సందర్భంలో కూడా భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కరోనాను భారత్ తో లింక్ పెట్టడంతో పాటు రాముడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా చైనాకు అనుకూలంగా ఉంటూ, డ్రాగన్ దేశం చెప్పిన విధంగా భారత్ ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. 2020లో ఉత్తరాఖండ్ లోని దార్ఛులాను లిపులేఖ్ పాస్ ను కలిపే 80 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారిని ప్రారంభించింది. ఈ సమయంలో నేపాల్, భారత్ లోని మూడు ప్రాంతాలు తమవిగా ఆరోపణలు చేస్తోంది. నేపాల్ తమ అసెంబ్లీలో కూడా ఈ మూడు ప్రాంతాలపై తీర్మానం చేసింది. ఈ భూభాగాలను తమవిగా చూపుతూ.. నేపాల్ కొత్త మ్యాపులను కూడా రిలీజ్ చేసింది. ఈ చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది ఏకపక్ష చర్య అని భారత్ స్పందించింది. దీంతో పాటు కేపీ ఓలీ హిమాలయాల్లోని కాళీ నది ప్రవాహ మార్గాన్ని భారత్ మారుస్తోందని విమర్శించారు. నవంబర్ 20,2022న నేపాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అక్కడి ప్రాంతాలు జాతీయ భావాలను రెచ్చగొట్టేందుకు భారత్ పై విమర్శలు చేస్తున్నారు.