ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన తనిష్క్ రాజన్ ఇప్పుడు 'నేనెవరు' మూవీలో నటిస్తోంది. డిసెంబర్ 2న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. రంగస్థలం నుండి సినిమాల్లోకి వచ్చిన తనిష్క్ ఈ సినిమాలోని పాత్ర తనకు గుర్తింపు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
సీనియర్ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ నటించిన సినిమా 'నేనెవరు'. ఈ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ మొదటివారం జనం ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రచార చిత్రాన్ని నిర్మాతలు విడుదల చేశారు.
ప్రముఖ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'నేనెవరు'. సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ మూవీకి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించారు.