ఆరేళ్ళ క్రితం రానా - తేజ కాంబినేషన్ లో వచ్చిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లోనే సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్ళయ్యాక మరింత అందంగా మారింది కాజల్ అంటూ అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. కాజల్ తెరపై కనిపిస్తే చాలు అని అభిమానులు ఈ నాటికీ ఆశిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కాజల్ ఓ బిడ్డ తల్లయినా, ఇంకా కెమెరా ముందు నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉం�