నెల్లూరు కోర్టులో దొంగలు పడడం కలకలం సృష్టించింది.. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే, నెల్లూరు ఎస్పీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. నెల్లూరు కోర్టులో కాకాని ఫైల్ మాత్రమే దొంగలు ఎలా దొంగతనం చేస్తారు..? అని ప్రశ్నించారు.. ఎన్నో ఫైళ్లు ఉండే కోర్టులో ఒక కాకాని ఫైల్ మాత్రమే దొంగలకు దొరికిందా..? నెల్లూరు ఎస్పీ ఖాకి డ్రెస్ వేసుకున్నారా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం…
మంత్రివర్గంలో బెర్త్ మొదటిసారి తృటిలో తప్పినా.. రెండోసారి మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఆ ఆనందం మాత్రం మిగలడం లేదు. మంత్రిగా జిల్లాలో అడుగు పెట్టకముందే.. ఒకవైపు సొంత పార్టీ నాయకుల నుంచి.. మరోవైపు పాత కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన వచ్చిన కష్టాలేంటి? ఆదిలోనే హంసపాదుగా మారిన విషయాలేంటి? కాకాణి గోవర్దన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు…
నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం…
ఆదమరిస్తే దొంగనోట్లతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి లక్షా నలభై ఏడు వేల రూపాయలు 500 రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా కావలి, కావలి రూరల్ పరిసర ప్రాంతాల్లో కావలి పట్టణ ప్రాంతంలో దొంగనోట్ల చలామణి భారీగా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు బయటపడుతున్నాయి. కావలి అడిషనల్…
ప్రకాశం జెడ్పీ సమావేశం వినూత్నంగా జరిగింది. జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి సమావేశంలో పలు ప్రత్యేకతలు కనిపించాయి. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు, బాపట్ల జిల్లాలకు వెళ్లటంతో ఆ జిల్లాల అధికారులు కూడా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగినా జెడ్పీ పాలకవర్గం విడిపోకపోవటంతో జెడ్పీ సమావేశానికి భార్యాభర్తలైన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లతో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. మొదటి సారి ఇలాంటి సన్నివేశం జరగడంతో ఏ జిల్లాలోకి వెళ్లిన మండలాల సమస్యలను…
ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పొరుగు రాష్ట్రాల మద్యం పట్టుబడుతూనే ఉంది… ఏపీలో లిక్కర్ ధరలు కాస్త అధికంగా ఉండడంతో.. కొందరు కేటుగాళ్లు పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు.. అయితే, నెల్లూరులో గోవా మద్యం వ్యాపారం వెనుక వైసీపీ నేతలున్నారు అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని మార్చుకుని పాలన సాగించే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్న ఆయన.. మద్యం పేరుతో స్లోపాయిజన్ అమ్మి ప్రజల…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటించారు.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే, సీఎం వైఎస్ జగన్.. నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా…
వాళ్లిద్దరి మాట వేరు.. బాట వేరు. మొన్నటి వరకు ఒకేపార్టీలో ఉన్నా.. ఎన్నికలకు ముందు వేర్వేరు పార్టీల్లో ఉండిపోయారు. ఇప్పుడు సడెన్‌గా వారిద్దరి మాట-బాట కలిసింది. అది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు..? కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపిందా? టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి…
మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఉదయం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉదయగిరి వరకు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. ఈ అంతిమ యాత్రలో నేతలు, మంత్రులతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11…