Twist in saipriya missing case in vishakapatnam rk beach విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్‌తో…
తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ భూప్రకంపనలు భయపెడుతూనే ఉన్నాయి.. అయితే, అవి తీవ్రస్థాయి భూకంపాలు మాత్రం కావు.. తాజాగా, నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. ఇవాళ ఉదయం జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.. దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతో పాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.. పలు గ్రామాలలో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. భూ ప్రకంపనల కారణంలో ఇళ్లలోని వస్తువులు…
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.…
మెట్ట ప్రాంత ఆరోగ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది భారీగా భక్తులు వస్తారని ఉద్దేశంతో ముందస్తుగా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు .ముఖ్యంగా ఐదు రోజుల పాటు జరిగే వెంగమాంబ…
సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూసినప్పుడు మనం ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నాం అనిపించకమానదు. ఆ ఘటనలు విన్నప్పుడు కడుపు రగిలిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక ఘటనే పెద్దిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. కన్నబిడ్డలపై ఒక తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంటే.. ఈ రాక్షసుడు మాత్రం క్షుద్ర పూజల పేరుతో చిన్నారిని బలితీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణు కుటుంబంతో సహా కలిసి నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో నివాసముంటున్నాడు. అతనికి…
నెల్లూరు జిల్లాలో వై.సి.పి.నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా ఈ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్…మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కాకాణికి శుభాకాంక్షలు చెప్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో…
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనం కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వై.సి.పి ఎం.ఎల్.ఏగా ఉన్నారు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగానే అనం రామనారాయణ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 వరకూ కాంగ్రెస్ లో ఉన్న ఆనం..అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో టిడిపిలో చేరారు. చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించారు. కానీ ఏ పదవి కూడా ఇవ్వకపోవడం..కీలక సమావేశాలకు ఆహ్వానించక పోవడంతో కినుకు…
ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.. దీంతో, కొత్తగా ఏర్పడ్డ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చిందని తెలిపారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.. ఆత్మకూరు ఉప ఎన్నికపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కోడ్ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ గడపగడపకు సహా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేశారు. Read…
నెల్లూరు నగరానికి చేరువలో ఉన్న నియోజకవర్గం కోవూరులో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇక్కడ టీడీపీ నేతల కదలికలు జోరందుకున్నాయి. గత ఎన్నికలలో ఓడిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. 2019లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి డీలా పడిన మరో టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సైతం ఈసారి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా…