Somireddy: ఏరులైపారుతోన్న పొరుగు రాష్ర్టాల లిక్కర్.. వ్యాపారం వెనుక వైసీపీ నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పొరుగు రాష్ట్రాల మద్యం పట్టుబడుతూనే ఉంది… ఏపీలో లిక్కర్ ధరలు కాస్త అధికంగా ఉండడంతో.. కొందరు కేటుగాళ్లు పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు.. అయితే, నెల్లూరులో గోవా మద్యం వ్యాపారం వెనుక వైసీపీ నేతలున్నారు అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని మార్చుకుని పాలన సాగించే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్న ఆయన.. మద్యం పేరుతో స్లోపాయిజన్ అమ్మి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారని ఆరోపించారు.
Read Also: TSRTC: ఆర్టీసీ ఉగాది ఆఫర్.. వారికి ఉచిత ప్రయాణం
Also Read
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
మొన్న గోవా మందు, నిన్న పుదుచ్చేరి మందు… ఇలా నెల్లూరులో పొరుగు రాష్ర్టాల మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు సోమిరెడ్డి.. పెద్దల హస్తం లేకుండా గోవా నుంచి రూ.20కి చీప్ లిక్కర్ ను తెచ్చి నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పబ్లిక్‌గా విక్రయించడం సాధ్యం కాదన్నారు. గోవా నుంచి నాసిరకమైన మద్యం తేవడం మన నెల్లూరోళ్లకు కొత్తకాదని.. 2014లోనూ అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ముఠాతో కలిసి గోవా నుంచి మద్యం తెచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, ఏపీలో లిక్కర్ అమ్మకాలు, మరణాలపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.. అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ వ్యవహారం కుదిపేసింది.. టీడీపీ సభ్యులు ప్రతీరోజు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..