ఎడతెరిపి లేని వానలు, వరదలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట తదితర మండలాల్లోని పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇళ్లను వారు పరిశీలించారు. గంగపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్అండ్బి రోడ్లు, ఇసుకమేట వేసిన వరిపొలాలు, కోతకు గురైన చెరువులు, ఇందుకూరుపేటలోని ముదివర్తిపాళెంలో నీట మునిగిన రాజుకాలనీని పరిశీలించారు.
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే…
ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. మరు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం వర్షాలతో అతలాకుతలం అయ్యింది. తాజాగా నెల్లూరు వరదల్లో ఒక చిత్ర బృందం చిక్కుకుపోయింది. వారు సాయం కావాలంటూ వీడియో ద్వారా తెలపడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వీడియోలో తన పేరు నవీన్ అని, తాము ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నెల్లూరు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడికి వచ్చాకా భారీ…
భారీవర్షా ల కారణంగా నెల్లూరు జిల్లా వాసులు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. పెన్నానదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. దాదాపు 30 గ్రామాలు నీట మునిగాయి. నెల్లూరులోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. భగత్ సింగ్ కాలనీ, జనార్ధన్ రెడ్డి కాలనీ, జయలలిలతా నగర్, పొర్లుకట్ట, ఈద్గా కాలనీ, శివగిరి కాలనీ, మన్సూర్ నగర్, మనుమసిద్ది నగర్, పుట్టా ఎస్టేట్, తల్పగిరికాలనీలు నీట మునిగాయి. వర్షాల వల్ల…
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…
మొదటి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం జగన్, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి జిల్లా కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన సీఎం జగన్ వారికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల, ప్రభావాన్ని అడిగి తెలుసు కున్నారు. సీఎం జగన్.రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు తగిన చర్యలు తీసుకోవా లన్నారు. అవసర మైన చోట వెంటనే సహాయక…
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో కుండపోత వర్షాలతో జన జీవనం అస్తవ్యవస్తమయింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తిరుపతిలోని ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికా రులు రోడ్లను మూసివేశారు. ప్రధాన కూడళ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నైకి ఆగ్నేయంగా 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తగిన సహాయక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాల్లో…
ఏపీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా 310కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయి వుంది. రేపు తమిళనాడు,దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ మెస్సేజ్ వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జలదిగ్బంధంలో కపిలతీర్దం. ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేసింది టీటీడీ.…