Anil Kumar Yadav: నేను ముక్కుసూటిగా ఉండే వ్యక్తిని.. అందుకే కొందరితో మనస్పర్థలు, ఇబ్బందులు ఉంటాయన్నారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. రెడ్డి సామాజిక వర్గం నాకు వ్యతిరేకమని పలువురు ప్రచారం చేస్తున్నారు.. నేను పనిచేస్తున్న నాయకుడు కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తే కదా? అని ప్రశ్నించిన ఆయన.. ఆ వర్గానికి చెందిన వారే ఆయనను మోసం చేశారేమో..! కానీ, నేను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. ఇక, ఇద్దరు ముగ్గురితో విభేదాలు రాకుండా ఎలా ఉంటాయి? అని ప్రశ్నించారు. నేను ముక్కుసూటిగా వ్యవహరిస్తా.. అందువల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అందువల్లే నాపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Devil : ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నేను చెన్నై, హైదరాబాద్‌కు వెళ్లినప్పుడల్లా రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకమని పలువురు నన్ను అడుగుతున్నారు.. నా మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్.. ప్రతి డివిజన్ లోనూ నాకు కార్పొరేటర్లుగా పలువురు రెడ్లు ఉన్నారు.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది పాఠశాల కరస్పాండెంట్లు.. వైద్యులు నాతో ఉన్నారు.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అందరూ కలిసికట్టుగానే ఉన్నాం.. అందువల్లే రెండుసార్లు గెలిచాను.. రెడ్లు అధికంగా నివసించే ఆదిత్య నగర్ ప్రాంతంలో నాకు మెజార్టీ వస్తోంది.. నా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నన్ను ఆశీర్వదిస్తుంది.. ఆ నమ్మకం నాకుందన్నారు. నాకు ఎవరితో విభేదాలు.. ఇబ్బందులు లేవన్న ఆయన.. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం ఆశీస్సులు. దీవెనలు.. ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.