నెల్లూరులో ఎంతటి ఉద్వేగాన్ని చూడలేదని.. ఇంత ప్రేమ అభిమానాలను చూపిస్తారని కలలో కూడా అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నారని.. నెల్లూరులో గల్లీ.. గల్లీ తిరిగిన వ్యక్తని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. “నాకు తిరుపతిలో గల్లి గల్లి తెలుసు పవన్ కళ్యాణ్ కు నెల్లూరులో అంతా తెలుసు. సింహపురిలో చరిత్ర తిరగ రాయబడుతుంది. టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే ఎవరైనా ఉంటారా. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం. ప్రజలకు బంగారు భవిష్యత్…
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డిని వైసీపీ లోకి ఆహ్వానించామని వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. క్రాంతి రెడ్డి అందుకు అంగీకారం తెలిపారని.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. మను క్రాంత్ రెడ్డి హోదా .అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామని., ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ భవితవ్యం పై మంచి నిర్ణయం తీసుకుంటాం అన్ని చెప్పుకొచ్చారు.…
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు.
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్లో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని స్వర్ణకారులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు.