Nellore: ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో అగ్నిప్రమాదం.. దివ్యాంగురాలు మృతి
- నెల్లూరు బర్మాషెల్గుంటలో అగ్నిప్రమాదం
- 6 సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీగా వ్యాపించిన మంటలు
- నాలుగు పూరిళ్లు దగ్ధం
- మంటల్లో చిక్కుకుని దివ్యాంగురాలు నాగలక్ష్మి మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore: నెల్లూరులోని బర్మాషెల్ గుంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని పదిహేనేళ్ల దివ్యాంగురాలు నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పూరిగుడిసెల్లోనే కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలిసింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూరిగుడిసెలు కావడంతో మంటలు వ్యాపించడంతో గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూరిగుడిసెల్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. బీరువాల్లోని బట్టలు, ఇతర సామాగ్రి కూడా దగ్ధమయ్యాయి.
Read Also: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు
Also Read
అగ్ని ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్ని అన్నీ విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద ప్రతీ ఇంటికి రూ. 15వేలు, మృతి చెందిన దివ్యాంగురాలికి రూ. 30వేలు ఇస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!