నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు కారాగారం వద్దకు పిన్నెల్లి అనుచరులు తరలివచ్చారు. విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు వెనుదిరిగారు.
Chandrababu: నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా సొమశీల జలాశయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత జలాశయ మరమ్మతు పనులపై సమీక్షించనున్నారు.
మనీ స్కీం పేరుతో నెల్లూరులో మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ద్వారా వివిధ ఏజెంట్ నియమించుకొని ప్రజల నుంచి రూ.500 నుంచి 6 వేల రూపాయల వరకూ వసూలు చేశారు.
రేపు సోమశిల జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు(సోమవారం) శ్రీసిటలో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయడంతో పాటు మరో 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అలాగే ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.
ఇప్పటి వరకూ లక్ష మంది శిక్షణ తీసుకున్నారు.. గ్రామీణ సాధికారతే లక్ష్యంగా ఈ ట్రస్ట్ పని చేస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ పని చేస్తోంది అని వెంకయ్య నాయుడు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.. వెంకయ్య నాయుడు ఆలోచనలు మహోన్నతమైనవి.. ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని తెలిపారు.
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు.