Bird Flu: నెల్లూరులో బర్డ్‌ఫ్లూ కలకలం.. చికెన్ విక్రయాలపై నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu: మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామంలోని రెండు కోళ్ల ఫారంలలో బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారించారు అధికారులు.. అంతే కాదు.. మూడు నెలలపై పాటు చికెన్ విక్రయాలపై నిషేధం విధించినిట్టు వెల్లడించారు.. చాటగొట్ల గ్రామంలోని రెండు కోళ్ల ఫారమ్‌లలో కోళ్లు చనిపోతుండడంతో శాంపిల్స్ సేకరించిన అధికారులు.. వాటిని భోపాల్‌కు పంపించారు.. అయితే, కోళ్లకు సోకింది బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ జరగడంతో అప్రమత్తం అయ్యారు.. మూడు నెలల పాటు చాటగొట్ల పరిసర ప్రాంతాల్లో చికెన్ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.. చాటగొట్లకు 10 కిలో మీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు అధికారులు.. ఇక, సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.
Read Also: Coach Jai Simha: నేను మద్యం సేవించలేదు.. కూల్ డ్రింక్ మాత్రమే తాగాను: కోచ్ జై సింహా
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
చాటగొట్లలో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాతపడినట్టు చెబుతున్నారు.. దీంతో, జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి.. ఇక, తాజాగా అది బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ కావడంతో.. గ్రామస్తులు వణికిపోతున్నారు. అయితే, బర్డ్ ఫ్లూ వ్యాప్తిచెందకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్.. పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. బయట వ్యక్తులు రావొద్దని తెలిపారు.. ముఖ్యంగా చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు అధికారులు. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడి నెల్లూరు జిల్లా సమర్థక శాఖ సహాయ సంచాలకులు చైతన్య కిషోర్.. బర్ద్ ఫ్లూతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. చాట గొట్ల.. గుమ్మల్ల దిబ్బ గ్రామాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు.. దేశంలో మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు చైతన్య కిషోర్.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!