వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని…
జాతీయ వైద్య విద్యా ప్రవేశాల పరీక్ష (నీట్)ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది సుప్రీంకోర్టు.. దీంతో.. నీట్ యథాతథంగా నిర్వహించనున్నారు.. కాగా, సెప్టెంబరు 12న నీట్ నిర్వహణకు ఇప్పటికే ప్రకటన విడుదల కాగా.. అదేరోజు మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు.. నీట్ వాయిదా వేయాలని, మరో తేదీ ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించారు.. అయితే, నీట్ యథాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం…