Srinivas Goud : పీవీ మార్గ్ లోని నీరా కేఫ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించుకు పోతున్న కుల వృతులను కాపాడాలని నాటి ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించారని, మీ కుల వృత్తిని కాపాడమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. నీరా పాలసీ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఆరోగ్య కరమైన నీరా పానీయం అందించే లక్ష్యం చేసిందన్నా శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రొడక్ట్స్…
Neera Cafe: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ నగరవాసులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రూ.16 కోట్లతో నీరా కేఫ్ ను టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు స్టార్ హోటల్ ను తలపించేలా నిర్మించారు.
Neera cafe: ట్యాంక్ తీరంపై ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా.. పక్కనే కొత్త సచివాలయం ఏర్పాటైంది. కాగా.. ఇప్పుడు నీరా కేఫ్ కూడా సిద్ధమైంది. నగరవాసులకు నోరూరించే తీపి నీరాను అందించి పరిశ్రమ స్థాయికి నీరాను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 'నీరా కేఫ్'ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్న నీరా కేఫ్ లకు నిర్ణయించిన పేరుపై వివాదం రేగింది. నీరా కేఫ్ కు వేదామృతంగా తెలంగాణ ప్రభుత్వం పేరు పెట్టింది. దీంతో.. నీరా కేఫ్ కు వేదామృతం పేరు పెట్టడంపై తెలంగాణ బ్రాహ్మణ, హైందవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.