Srinivas Goud: నీరా కేఫ్ పేరుపై బ్రాహ్మణ సంఘాల వివాదం.. స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్న నీరా కేఫ్ లకు నిర్ణయించిన పేరుపై వివాదం రేగింది. నీరా కేఫ్ కు వేదామృతంగా తెలంగాణ ప్రభుత్వం పేరు పెట్టింది. దీంతో.. నీరా కేఫ్ కు వేదామృతం పేరు పెట్టడంపై తెలంగాణ బ్రాహ్మణ, హైందవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా.. నీరా కేఫ్ కు ఈ పేరు పెట్టడం అంటే హిందూ సంస్కృతిలో భాగమైన వేదాలను అవమానించడమే అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. నీరా కేఫ్ లో కల్లుకు వేదామృతం పేరును తొలగించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రాహ్మణ సంస్థ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచారికి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న వినతి పత్రం అందజేశారు. ఇకదీనిపై ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కాగా.. వేదామృతం అనే పదంపై వివాదం ఉంటే పరిశీలిస్తామని చెప్పారు. ఇక.. కల్లు వేరు నీరా వేరని చెప్పిన మంత్రి.. వేదాలను అధ్యయనం చేసిన తర్వాతే నీరా కేఫ్ లకు వేదామృతం అనే పేరు చూసించామన్నారు. అంతేకాకుండా.. తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాలు వర్ణించాయని, వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వేదాల్లో సురాపానం గురించి ఉందన్నారు.
Read also: Ponguleti Srinivasa Reddy: నేను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదు.. నాకు సెక్యూరిటీ అవసరం లేదు
Also Read
అయితే.. నీరా కేఫ్‌లకు వేదామృతం అని పేరు పెట్టి వేదాలను కించపరుస్తున్నారని తెలంగాణ ఎక్సైజ్ శాఖపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో.. వేదామృతం పేరు పెట్టాలనే నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అంతేకాకుండా.. వేదామృతం పేరు మార్చేలా చూడాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడికి ఈ మేరకు వినతి పత్రం అందజేశాయి. ఈ..పేరు మార్చకపోతే ఆందోళన చేస్తామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. అయితే ఇదిలా ఉండగా నీరా ప్రాజెక్టుకు వేదామృతం అనే పేరు మార్చొద్దని జైగౌడ్ ఉద్యమనేతలు డిమాండ్ చేస్తున్నాయి..పేరు మార్పు ఆలోచన చేస్తే సహించేది లేదని హెచ్చారిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ & డైరీ లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?