బీహార్‌లో తొలి విడత సమరానికి సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు.
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి శిరోభారంగా తయారైంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటాపోటీ చర్యలు వ్యక్తిగత ప్రతిష్ఠను, పార్టీ ఇమేజ్ ను బజారులో పెడుతున్నాయి. ఈ దిశగా కొన్ని జిల్లాల్లో వ్యవహారాలు హద్దులు దాటిపోగా…..ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం నివురుగప్పి కనిపిస్తోంది. కూటమిలో ఒకరంటే…ఒకరికి పడకపోవడం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మొదలైపోతే….ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదు. ఒక విధంగా గ్రూప్ రాజకీయాలు కట్టి…
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది అని ఆరోపించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయి.. మానిఫెస్టోలు అమలు చేయటంతో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి.. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది.. ప్రభుత్వమే నేరస్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు…
బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. గురువారమే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.
PM Modi:ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత దేశం తన సైన్యాన్ని చూసి గర్వపడిందని, కానీ కాంగ్రెస్-ఆర్జేడీ దానిని ఇష్టపడటం లేదని ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. బీహార్‌లోని అర్రాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రెండు పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోతోంది. ఆపరేషన్ సిందూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్ కోలుకోలేదు’’ అని గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు.
Bihar Election 2025: బీహార్ ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయంలో ఉంది. 243 సీట్లకు రెండు విడుతలుగా నవంబర్ 6, 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడుతాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష మహాఘటబంధన్ లోని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాల కూటమికి ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే అనుకుంటుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆర్జేడీ కూటమి భావిస్తోంది.
Nitish Kumar: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2005లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి తాను ‘‘నిజాయితీగా కష్టపడి పనిచేయడం ’’ ద్వారా ప్రజలకు సేవ చేశానని అన్నారు. మూడు నిమిషాల వీడియోలో.. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2005కు ముందు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయంగా ఉండేదని చెప్పారు.
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా బీహారీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. తానెప్పుడూ కుటుంబం కోసం పని చేయలేదని.. 2005లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు బీహార్ ప్రజల కోసం నిజాయితీగా.. కష్టపడి సేవ చేసినట్లుగా వివరించారు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీకి 150 సీట్లు వస్తాయని.. లేదంటే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.
ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.