ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది.…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్ ఎన్నికల వేళ అన్నదాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Off The Record: నకిలీ మద్యం ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్‌ని ఓ కుదుపు కుదిపేస్తోంది. దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. గట్టిగా మాట్లాడుకుంటే… ఇప్పుడు రాష్ట్రంలో వేరే ఏ సమస్యా లేదా అన్నంత రేంజ్‌లో దాని చుట్టూ రాజకీయం కుమ్ముకుంది. అయితే…. ఇంత జరుగుతున్నా… కూటమిలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటున్న బీజేపీ వైపు నుంచి నో రియాక్షన్. తప్పు జరిగిందనో, జరగలేదనో… అదీ ఇదీ కాదంటే… ఎట్‌లీస్ట్ రొటీన్‌గా చెప్పే……
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్‌లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని…
Bihar Elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమిలు ప్రచారాలు మొదలుపెట్టాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే కూటమి భావిస్తుంటే, దశాబ్ధానికి పైగా అధికారానికి దూరంగా ఉన్న ఆర్జేడీ గెలుపు రుచి చూడాలని అనుకుంటోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6న ,నవంబర్ 11న రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.
మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించిన తర్వాత ఎన్డీఏ కూటమి వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
మహాఘట్‌బంధన్‌లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు