Sharad Pawar: ఈ ఏడాది చివర్లో అక్టోబర్-నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఏంవీఏ) సిద్ధం అవుతున్నాయి.
Maharashtra: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తుకు బీటలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి కన్నా ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ, ఎన్సీపీ మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి.
Uddhav Thackeray: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న మహారాష్ట్రలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 09 స్థానాలు, దాని మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, ఎన్సీపీ(అజిత్ పవార్) 01 స్థానాలను మాత్రమే సాధించాయి.
Modi Cabinet: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు దక్కింది.
ఇదిలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా దారుణ ఫలితాలను చవి చూసింది. చివరకు బారామతిలో భార్య సునేత్రా పవార్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. 05 స్థానాల్లో పోటీ చేసి ఒకే స్థానంలో గెలిచాడు. ఈ పరిణామాల తర్వాత ఈ రోజు ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది.
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.