Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది.
Nayab Singh Saini Oath: హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన వేడుకలో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. హర్యానాలో…
PM Modi To Attend Nayab Singh Saini Oath Ceremony: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మరి కొద్ది గంటల్లో కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచకులలోని సెక్టార్ 5 దసరా గ్రౌండ్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీయే పాలిత…
Chandrababu- Pawan: నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. వీరు ఎన్డీయే కూటమిలో భాగమైనందున హర్యానాకు వెళ్తున్నారు.
Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఎంపికయ్యారు. అక్టోబర్ 17 అంటే రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హర్యానాకు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ కట్టడ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా నయాబ్ సింగ్ సైనీని తమ నేతగా ఎన్నుకున్నారు.
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తామని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్‌గా గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణస్వీకారం చేయనున్నారు. పంచకులలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.
Nayab Singh Saini: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుసగా మూడో విజయాన్ని సాధించి పెట్టిన నయాబ్ సింగ్ సైనీ ఈ నెల 15వ తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
హర్యానాలో మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అంచాలన్నీ తల్లకిందులు చేస్తూ కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటింది. 48 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ బీజేపీ సూపర్ విక్టరీని అందుకుంది.
Haryana Assembly Election 2024: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం (అక్టోబర్ 5) ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో పాటు 1027 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రధాన…