అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే రష్యాకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడటానికి జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది.
2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
Ukraine joining NATO will lead to World War III, warns Putin's Russia: ఉక్రెయిన్ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేర్చుకుంటే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా వార్నింగ్ ఇచ్చింది. రష్యా భద్రతా మండలిలోని ఓ అధికారి గురువారం ఈ వ్యాఖ్యలను చేశారు. గత నెల సెప్టెంబర్ 30న రష్యా ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని రష్యా తన దేశంలో కలుపుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు భాగాలైన ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్,…
More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు…
Six months into the Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి ఆరు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాలు ప్రతీ రోజు దాడులు చేసుకుంటున్నాయి. రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ సేనలు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్..
స్వీడన్, ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరబోతున్నాయి. అందుకు ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే ఈ విషయంపై మొదటి నుంచి రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో రష్యా ఈ విషయమై స్వీడన్, ఫిన్లాండ్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ రెండు దేశాలు నాటో కూటమిలో చేరడంపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తర్కమెనిస్థాన్ రాజధాని అష్గాబాత్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ మాదిరిగా రష్యాకు స్వీడన్, ఫిన్లాండ్ తో…
ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అనేక ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొనుగోలుపై పలు పాశ్చాత్య దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రష్యా నుంచి వైదొలుగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా ఉక్రెయిన్ పై దాడిని ఆపడం లేదు రష్యా. ఇదిలా ఉంటే భారత్ కు అతి తక్కువ రేటుకే రష్య చమురును ఆఫర్ చేసింది. దీంతో ఇండియా…
మూడు నెలలుగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. అయినా అటు రష్యా అధినేత పుతిన్, ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తగ్గడం లేదు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవాలని అనుకున్న రష్యాను నిలువరించారు. దీంతో…
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఎంత హెచ్చరించినా… నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్( నాటో) చేరడానికే మొగ్గు చూపాయి. తాజాగా బుధవారం నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ధ్రువీకరించారు. నాటోలో చేరితే మాస్కో నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని రష్యా హెచ్చరించానా ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉంటే స్వీడన్, ఫిన్లాండ్…
ఉక్రెయిన్‌పై సరిగ్గా నెల కిందట యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోయింది. కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని…