భారత్ తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్( నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే వీలుకుదిరినప్పుడల్లా భారత్ తో సన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అంతేకాదు భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చించాడనికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్ పేర్కొన్నారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా యూఎస్ ప్రత్యక్ష సంకేతాలిస్తున్నట్లుగా ఉంది.
Also Read : ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం..
ఈ మేరకు భారత్, యూఎస్ ల మధ్య సన్నిహిత సంబంధాల గురించి.. రెండు దేశాల మధ్య భాగస్వా్మ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, సాంకేతిక, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు. సోవియట్ యూనియన్ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్ తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు.
Also Read : Jaipur blasts case: నలుగురు నిందితులు విడుదల.. సుప్రీంను ఆశ్రయించిన రాజస్థాన్ సర్కార్
ఆయా ప్రాంతాల్లోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాలతో పాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానాలకి సంబంధించిన హైబ్రిడ్ వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇండో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథూవేనియాలో జరుగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు జూలియన్నే స్మిత్ తెలిపారు.
Also Read : Simhadri Appanna Pushkarini: సింహాద్రి అప్పన్న ఆలయంలో విషాదం.. పుష్కరిణిలో మృతదేహం..
ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ది చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని.. పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్-రష్యా యుద్దం గురించి కూడా కామెంట్స్ చేసింది. రష్యా అధ్యక్షుడు అనుకుంటే ఒక్క రోజులో యుద్దాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ ఉక్రెయిన్ కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది.
Also Read : Bangalore: కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం
యుద్దాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎస్ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్దం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్దంలో రష్య గనుక వ్యూహాత్మ అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు.