ఉక్రెయిన్ -రష్యా యుద్ధంతో అక్కడ వున్న విదేశీ విద్యార్ధులు, పౌరులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థులకు తల్లిదండ్రులకు వర్చవల్ గా ధైర్యం, జాగ్రత్తలు చెబుతూ భారత దేశానికీ మరింత వేగంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ . ప్రోగ్రాంలో నిర్వాహకులు, ముఖ్య నాయకులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, ఎంపీ జీవీల్ నరసింహారావు, బీజేపీ…
రష్యాను నిలువరిస్తామని, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని నాటో దేశాలు, అమెరికా మొదటి నుంచి చెబుతూ వస్తున్నది. ఉక్రెయిన్ కోసం నాటో దళాలను సరిహద్దులకు తరలించి చాలా రోజులైంది. కానీ ఆ దళాలు ఉక్రెయిన్‌లోకి ఎంటర్ కాలేదు. అమెరికా సైతం తమ బలగాలను పోలెండ్‌కు తరలించింది. అయితే, రష్యాతో నేరుగా యుద్ధం చేయబోమని, ఉక్రెయిన్‌కు అవసరమైన సహకారం మాత్రమే చేస్తామని చెబుతూ వచ్చింది. నాటో, అమెరికా దేశాలు అండగా ఉంటాయని అనుకున్న ఉక్రెయిన్‌కు భంగపాటే మిగిలింది. యుద్ధం వచ్చే…
ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు దిగుతున్నట్లు రష్యా ప్రకటించిన వెంటనే సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బలగాలు ఆక్రమించాయి. బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో అతిపెద్ద రెండో నగరం ఖార్కివ్‌నూ రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరోవైపు మరియపోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా నగరాల్లోనూ రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో పరిస్థితులు దిగజారాయి. రష్యాతో ఉన్న అన్ని రకాల సంబంధాలను ఉక్రెయిన్ తెగతెంపులు చేసేసుకున్నది. రెండు స్వతంత్ర దేశాలల్లో శాంతిని పరిరక్షించడం కోసం రష్యా తన సైన్యాన్ని ఆ రెండు దేశాలకు పంపింది. పదేళ్లపాటు రెండు దేశాల్లో రష్యా దళాలు ఉంటాయి. స్వతంత్ర ప్రాంతాలతో పాటు రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటుందనే సంకేతాలు…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. బోర్డర్‌లో ఉక్రెయిన్ సైన్యం దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తుండగా, ఇదంతా ఫేక్ వార్తలని, తాము ఎలాంటి దాడులు చేయడం లేదని ఉక్రెయిన్ సైన్యం చెబుతున్నది. గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోవడంతో ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి అక్కడి మహిళలు తాము సైతం అంటూ యుద్ధ శిక్షణ తీసుకుంటున్నారు. యుద్ధం అనివార్యమైతే దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారు. Read: Moon:…
రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌కు మూడు వైపులా భారీ సంఖ్యలో రష్యా సైన్యం మోహరించింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేంగా కొందరు దేశం లోపల పనిచేస్తున్నారు. రష్యా అనుకూల వేర్పాటు వాదులకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్ణణలే దీనికి కారణమౌతున్నాయని పుతిన్ చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన సైన్యం కాల్పులు జరిపినట్లు రష్యా సైన్యం వెల్లడించింది. రాకెట్ లాంచర్లతో రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్ల దాడిలో రష్యా…
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టగా, ఉక్రెయిన్‌లో రెబల్స్ తిరుగుబాటు దారులు దాడులు చేసేందుకు సిద్దమయ్యారు. ఉక్రెయిన్ అనుకూల వాదులు ముందుగా దాడులకు దిగుతున్నారని, రెబల్స్ పేర్కొంటున్నారు. అయితే, ఉక్రెయిన్ వ్యతిరేకులే దాడులకు దిగుతున్నట్టు చెబుతున్నారు. దాడులకు దిగబోమని రష్యా చెబుతున్నది. కానీ, ఈ మాటలను నమ్మే స్థితిలో ప్రపంచదేశాలు లేవని, ఏ క్షణంలో అయినా రష్యా ట్రిగ్గర్ నొక్కే అవకాశం ఉంటుందని అమెరికా…
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. ఇప్పటికే విదేశీ పౌరులు, సిబ్బంది చాలా వరకు ఆ దేశాన్ని వీడారు. అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అయింది. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖాయమనే అంటున్నారు. అదే జరిగితే పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. రష్యా చర్యతో యూరప్ యుద్ధ రంగంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ రష్యా దాడి చేయకపోయినా సమీప భవిష్యత్‌లో ఈ ఉద్రిక్తతలు ఆగవు.…