Amit Shah: రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు.
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్‌గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్…
జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.