Hizb-ut-Tahrir: ఐఎస్ఐఎస్ ప్రేరేపిత రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’(HuT)ని కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద ఉగ్రవాద సంస్థగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) గురువారం అధికారికంగా ప్రకటించింది.
Chinese Garlic : దేశీ వెల్లుల్లిని ఆహారంలో కలుపుకుంటే ఆహారపు రుచి వేరుగా ఉంటుంది. అంతేకాకుండా దేశి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే దేశీ వెల్లుల్లితో పాటు, ఇప్పుడు చైనీస్ వెల్లుల్లి కూడా మార్కెట్‌లో అమ్ముడవుతోంది.
అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇటీవల జరిగి పార్లమెంట్ సమావేశాల్లో అదానీ వ్యవహారం కుదిపేసింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం అదానీ వ్యవహరంపైనే చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవి దేశభద్రతకు, మతస్వేచ్ఛకు పెనుసవాల్ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేయాలని సుప్రీం ఆదేశించింది.