వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది. Also Read:…
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను…
గుజరాత్ లోని దాహోద్ జిల్లా లోని పావ్‌డి గ్రామం.. మారుమూల గిరిజన ప్రాంతం కావడం చేత కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అలా అని ఆ గ్రామ ప్రజలు నిరుత్సహ పడలేదు.
సోమవారం ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ప్రితింకర్ దివాకర్, జస్టిస్ అశుతోష్ శ్రీవాస్తవల కలిసి ఓ ఆలయ ప్రాంగణ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ తీర్పు ఇచ్చారు.
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భర్త ఇంటిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. అయితే కాబోయే అత్తింటివారే తమ కూతురిని చంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. వివరాలు.. కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందిన ఐశ్యర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచి ఉద్యోగంలో సెటిలైన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పారు.…
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడో అధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. దీనిపై దర్యాప్తు చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు కలెక్టర్ కృష్ణతేజ తెలిపారు.