కరోనా మహమ్మారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. యూరప్, అమెరికా దేశాలను ఒమిక్రాన్ డామినెట్ చేయడంతో అక్కడ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికాలో రోజుకు 11 నుంచి 13 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అక్కడి చాలా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రోజుకు లక్ష మందికిపైగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలోనే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగానే కేసులు పెరుగుతున్నాయి. అయితే, డెల్టా కంటె ప్రమాదకరం కాదని నిపుణులు…