Smita sabharwal: తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచూ ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల వీడియోను ఆమె రీట్వీట్ చేశారు.