తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటిస్తున్నారు. రేవంత్ తో సహా వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వరంగల్ ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు సీఎం రేవంత్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్సంపేటపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్. రూ.532.24 కోట్లతో నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. Also Read:Putin: ‘‘చమురు, అణు శక్తి, నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్, సైన్యం’’.. పుతిన్…
వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కులత. మైనర్ లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్. దీనిలో భాగంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి. ఆ తర్వాత తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు…
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
Tiger Tension : గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం నాడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ , కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ లు కలిసి పులి ఆనవాళ్ళ కొరకు అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండంగా, రాంపూర్ అటవీ ప్రాంతంలోని మగ పులి ఆనవాళ్ళను మరోసారి కనుక్కోవడం జరిగింది.…
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని.. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు.. ఆదివాసీ, గిరిజన…
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు.
Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ములుగు నియోజకవర్గం తర్వాత… నర్సంపేట సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ తరువాత మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి యాత్ర వెళ్తుంది. ఇది ముందుగా అనుకున్న షెడ్యూల్‌గా చెబుతున్నారు. ములుగులో యాత్ర మొదలయ్యాక ఎక్కడా బ్రేకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని రేవంత్‌రెడ్డి కూడా భావించారట. అయితే ములుగులో యాత్ర పూర్తి కాగానే నర్సంపేట వెళ్లకుండా మహబూబాబాద్ నియోజకవర్గంలోకి ఎంటరైంది. దీంతో నర్సంపేటను…
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో అక్కడినుంచే ఆమె పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు.