రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
R-37M missile: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో, ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా, భారత్‌కి డెడ్లీ మిస్సైల్‌ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా తన లేటెస్ట్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57ని కూడా అందిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు R-37M హైపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణిని అందించేందుకు పుతిన్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ వద్ద ఉన్న Su-30MKI ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చాలనే…
PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన ముహాజీర్లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ…
Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.
నేడు గుజరాత్ పట్టణ ప్రగతి పథం వేడుకలు. వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ. స్థానిక సంస్థలకు రూ.3,300 కోట్ల నిధులు విడుదల. ఐపీఎల్లో నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేటి నుంచి ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభం. ఫేవరెట్‌గా బరిలో దిగనున్న తెలుగమ్మాయి జ్యోతి. గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన జ్యోతి. కడప జిల్లా : నేటి నుంచి కడపజిల్లా…
కాశ్మీర్లో యుద్ధ బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాయాది దేశం సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాయాది సైనిక చర్యలకు జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో పూంఛ్ ప్రాంతంలో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ఒక…
ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర…