BRICS Summit: బ్రెజిల్ అధ్యక్షతన రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమావేశాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. కాగా, ఈ బ్రిక్స్ సమావేశాల్లో ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, రిఫార్మ్స్ పై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే, అంతర్జాతీయ సవాళ్లకు, పరిష్కారాలపై కూడా ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. కాగా, వచ్చే ఏడాది బ్రిక్స్‌కు భారత దేశం అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ సమ్మిట్‌కు ప్రాధాన్యత చోటు చేసుకుంది.
Read Also: YSR 76th Birth Anniversary: మెల్‌బోర్న్‌లో వైఎస్సార్ 76వ జయంతి వేడుకలు
అయితే, భారత్‌ను కీలక భాగస్వామిగా అంతర్జాతీయ సముదాయం గుర్తిస్తుంది. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. భవిష్యత్ లో అంతర్జాతీయ వ్యవస్థల్లో భారత పాత్రపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు ప్రత్యామ్నాయ మోడల్‌గా భారత్ అభిప్రాయాలు వెల్లడించనుంది.