తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగాక వారికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వాళ్లను చేయాలని భావిస్తుంటారు. తమ బాధ్యతగా కొడుకులు, కూతుర్లకు వివాహాలు జరిపిస్తుంటారు. ఇదే విధంగా ఓ తండ్రి తన కుమారుడి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు. తగిన వధువును చూసి పెళ్లి జరిపించాలని కలలు కన్నాడు. కానీ, అతని కల కలగానే మిగిలిపోయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కుమారుడి పెళ్లి ఆగిపోయింది. అవమాన భారంగా భావించిన…
Bhu Bharathi: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు, నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామస్థాయిలో…
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488…
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని పట్టపగలు కొట్టి చంపిన దారుణ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, ఎవరైనా వ్యక్తులు లేదా గ్రూపులు భౌతిక దాడులు లేదా హత్యలకు పాల్పడితే, వారి స్థితి లేదా సంబంధాలతో సంబంధం లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రజల భద్రతకు…
అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్ పూర్ అర్భన్ పార్కలో దర్శనమిస్తుంది. ఈ అరుదైన పక్షిని ఇండియన్ పిట్ట గా పిలుస్తుంటారు. చాలా రంగులతో బ్యూటిపుల్ గా ఉంటుంది ఈ పిట్ట.
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2018లో అధికారపార్టీ టికెట్‌పైనే పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారా లేక కొత్త వారు బరిలో ఉంటారా? అనే ప్రశ్న చుట్టూనే మక్తల్ గులాబీ శిబిరంలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రామ్మోహన్‌రెడ్డి భార్య సుచరితారెడ్డి పేరు రేస్‌లోకి రావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గత…
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నారాయణ పేట జిల్లాలో ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణ పేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ. 64కోట్ల 43 లక్షల 19వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకుమంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. నారాయణపేట పట్టణం నుంచి ఎక్లాస్పూర్ మీదుగా తెలంగాణ కర్ణాటక సరిహద్దు…
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బయటి వెళ్లినవారు ఎప్పుడు ఎలా తిరిగొస్తారో తెలియక ఇంట్లో ఉన్నవాళ్లు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు మాగనూరువద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో వున్న 15మంది తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇక వివరాల్లోకి వెళితే.. కర్ణాటక లోని…
నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు. సన్న వడ్లు పండించిన వారికి ఐదు…