Narayanpet: ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. కుమారుడి పెళ్లి ఆగిందని తండ్రి ఆత్మహత్య
- నారాయణ పేట జిల్లాలో విషాదం
- కుమారుడి పెళ్లి ఆగిందని తండ్రి ఆత్మహత్య
- వధువు ప్రియుడితో వెళ్లిపోవడం తో పరవు పోయిందని ఆత్మహత్య చేసుకున్న గోవిందరావు ( 54)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగాక వారికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వాళ్లను చేయాలని భావిస్తుంటారు. తమ బాధ్యతగా కొడుకులు, కూతుర్లకు వివాహాలు జరిపిస్తుంటారు. ఇదే విధంగా ఓ తండ్రి తన కుమారుడి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు. తగిన వధువును చూసి పెళ్లి జరిపించాలని కలలు కన్నాడు. కానీ, అతని కల కలగానే మిగిలిపోయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కుమారుడి పెళ్లి ఆగిపోయింది. అవమాన భారంగా భావించిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నారాయణ పేట జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Spirit : స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్
Also Read
గోవిందరావు ( 54) తన కొడుకు అభిషేక్ కు బంధువుల అమ్మాయి శ్వేతతో పెళ్లి కుదుర్చుకున్నారు. ఇటీవల హంగు ఆర్భాటాలతో నిశ్చితార్థం జరిపించారు. ఇరు కుటుంబాలు ఎంతో సంతోషించాయి. పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ నెల 9న వివాహం జరాగాల్సి ఉంది. మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు పెళ్లి పత్రికలు పంచాడు గోవిందరావు. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. ఇక జరగాల్సింది వివాహమే. ఇంతలోనే వధువు శ్వేత ఊహించని షాకిచ్చింది.
Also Read:Vikram Misri: పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది
ఈ పెళ్లి ఇష్టం లేని శ్వేత తన ప్రియుడితో వెళ్లిపోయింది. శ్వేత చేసిన ఈ పనికి ఇరు కుటుంబాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తమ కుటుంబం పరువు పోయిందని భావించిన వరుడు తండ్రి గోవింద రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోవింద రావు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ప్రతి ఒక్కరిని కలిచివేసింది.
- Tags
- father
- Marriage
- narayanpet
- son
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!