రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బయటి వెళ్లినవారు ఎప్పుడు ఎలా తిరిగొస్తారో తెలియక ఇంట్లో ఉన్నవాళ్లు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు మాగనూరువద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో వున్న 15మంది తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇక వివరాల్లోకి వెళితే.. కర్ణాటక లోని హుబ్లీ నుంచి హైదరాబాద్ కు 45 మంది ప్రయాణికులతో బయలు దేరింది. నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్దకు రాగానే ప్రయాణిస్తున్న బస్సుకు అడ్డంగా బర్రె వచ్చింది. దీంతో డ్రైవర్ బర్రెను తప్పించేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. అయితే బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో ఇలాంటి ఘటనే మే 10న (మంగళవారం)ఉదయం చోటుచేసుకుంది. బస్సు-బొలెరో వాహనం ఢీకొని మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవదహనమైన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద చోటుచేసుకుంది. ఓప్రైవేటు బస్సు, బొలెరో వాహనం ఢీకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని వ్యక్తి సజీవదహనం సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు, గాయపడిన వారు కర్ణాటక వాసులుగా గుర్తించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల అప్రమత్తం లేకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.