వెంకీ అభిమానులు విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “నారప్ప”. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ పామ్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మేకర్స్. అప్పటి నుంచి సినిమాను ఓటిటిలో విడుదల చేయడం విషయమై మనసు మార్చుకోవాలంటూ వెంకీని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు వెంకటేష్ నటించిన “దృశ్యం-2, నారప్ప” రెండు చిత్రాలను కూడా నేరుగా ఓటిటి వేదికలపై స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు సురేష్…