ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబంతో కలిసి నేడు, రేపు తిరుమల పర్యటనకు వెళుతున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం దర్శించుకోనున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం…