'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నాడు సాయంత్రం పర్యటించారు. ముందుగా హనుమాన్ జంక్షన్ కు విచ్చేసిన భువనేశ్వరికి యార్లగడ్డ వెంకట్రావ్ దంపతులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఇవాళ్టి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించబోతున్నారు. ఈ రోజు నుంచి 23 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన జరుగనుంది.
గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు.. బెంబెలెత్తిపోయారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు.
Nara Bhuvaneswari’s Nijam Gelavali Yatra Schedule Today: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనపర్తి, నిడదవోలు, కోవ్వూరు, గోపాలపురం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పర్యటిస్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన సమయంలో వేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి..…
కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరులో "నిజం గెలవాలి" యాత్రలో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెనొప్పితో చనిపోయిన గోనేభావి గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, అతని చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం.. అతని కుటుంబానికి రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారని.. ప్రతి…
నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన.. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది అని ఆమె తెలిపారు. ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది.. సత్యం తన బలమెంతో చూపించింది.