స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇక, తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు విడుదల అయ్యారు. దీంతో చంద్రబాబు విడుదల కావడంతో నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన.. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది అని ఆమె తెలిపారు. ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది.. సత్యం తన బలమెంతో చూపించింది.. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు చేశారు అని నారా భువనేశ్వరి తెలిపారు.
Read Also: PAK vs BAN: తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్తాన్.. 204 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
మహిళలు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెపుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను అని భువనేశ్వరి కోరారు. ఆ దేవుడి దయతో ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను అని నారా భువనేశ్వరి ట్విట్టర్ ( ఎక్స్ ) ద్వారా వెల్లడించారు.
Bhuvaneshwari