ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం ఒక్క వెలుగు వెలిగింది. భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత ఆళ్లగడ్డలో ఆ కుటుంబానికి పట్టు సడలింది. భూమా అఖిల నిత్యం ప్రత్యర్థులతోపాటు.. ఒకప్పటి సన్నిహితులతోను, సొంత బంధువులతోను పోరాడాల్సి వస్తోంది. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ వివాదాలు, పెదనాన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డితో తగాదాలు… వెరసి జనం సమస్యల కంటే సొంత సమస్యలే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆమె దృష్టంతా వాటిపైనే పెట్టాల్సి…
ఏపీలో బుధవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయ్యిందని వదంతులు రాగా కలెక్టర్ హరినారాయణ స్పందించి వాటిని ఖండించారు. తాజాగా నంద్యాల జిల్లాలోనూ టెన్త్ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3…
సంక్రాంతి ముగిసేసరికి చలి తీవ్రత తగ్గాలి. కానీ ఈసారి సంక్రాంతి తర్వాత చలి చంపేస్తోంది. ఉదయం సూరీడు రావడం లేటవుతోంది. శనివారం ఏపీలో అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు నిజమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ చలి తీవ్రంగా వుండే అరకు ఈసారి కూడా అదే చలి ప్రభావం కనిపిస్తోంది. ఆంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో జంగమహేశ్వరపురంలో శనివారం ఉదయం 5.8 డిగ్రీల సెల్షియస్…
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసులు నమోదుచేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డి పై కేసు నమోదయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసింది సీబీఐ, తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బీఓబీ ఫిర్యాదు చేసింది. ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి ఫిర్యాదు చేసింది. రూ.61.86 కోట్ల నష్టం…
కర్నూలు నగరంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కలిగి ఉన్నాడనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు , కడప, నంద్యాలలో ఉంటున్న బంధువుల ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు జాకబ్ రాజశేఖర్. ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన…
కర్నూలు జూపాడుబంగ్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో వందలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు,విరోచనాలు తీవ్ర అస్వస్థతకు గురైన 20 మందిని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు పిల్లలు వున్నారు. వీరి పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెబుతున్నారు.జూపాడుబంగ్లాలోని నీలిపల్లె పేటకు చెందిన 20 మంది నందికొట్కూరు ఆసుపత్రిలో చేరారు. ఆరుగురు ఆందోళనకరంగా వుండడంతో వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మంచి నీరు కలుషితం కావడం వల్లే అతిసార ప్రబలుతోందని స్థానికులు చెబుతున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంకనగర్లో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్కు చెందిన గోవింద్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: ఇలానే కొనసాగితే… వాటికి ముప్పు…