కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు బాగోతం కొద్దీ రోజులుగా బయట పడుతోందని .. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా ఆయన దొంగలా తిరుగుతున్నారని ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు.
ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం…
అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే తాను ఎంపీ నందిగం సురేష్ బంధువును అని.. తన వాహనాన్నే ఆపుతారా అంటూ సుధీర్ అనే వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఎంపీ సురేష్‌కు అతడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను తన ఇంటికి వచ్చి కలవాలని ఎంపీ సురేష్ ఆదేశాలు ఆరీ చేశారు.…