నందమూరి తారకరత్న ప్రస్తుతం క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ‘9 అవర్స్’ అనే వెబ్ సీరిస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జూన్ 2 నుండి ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే అతను నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారథి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలలోనూ తారకరత్న నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలో తారకరత్న…
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో #SSMB28 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! జులై రెండో వారంలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో విలన్‌గా నందమూరి తారకరత్న నటించనున్నాడట! ట్విటర్‌లో తారకరత్న పేరిట ఉన్న అకౌంట్ నుంచి #SSMB28 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ట్వీట్ పడినప్పటి నుంచి, ఈ ప్రచారం జోరందుకుంది. నిజానికి.. అది వెరిఫైడ్ అకౌంట్ కాదు. అయినప్పటికీ అది…
నందమూరి నటవంశంలో హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరే! అయితే వారిలో నటరత్న యన్టీఆర్ వారసులుగా తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ యన్టీఆర్ స్థాయిలో రాణించినవారు లేరు. అయితే నటరత్న మరో మనవడు నందమూరి తారకరత్న చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడంతోనే ఓ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఒకే రోజు తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవం చూశారు. ఆ తొమ్మిది చిత్రాలలో తరువాత వెలుగు చూసినవి కొన్నే! అందులో విజయాలు చూసినవి లేవనే…