మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో #SSMB28 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! జులై రెండో వారంలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో విలన్‌గా నందమూరి తారకరత్న నటించనున్నాడట! ట్విటర్‌లో తారకరత్న పేరిట ఉన్న అకౌంట్ నుంచి #SSMB28 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ట్వీట్ పడినప్పటి నుంచి, ఈ ప్రచారం జోరందుకుంది. నిజానికి.. అది వెరిఫైడ్ అకౌంట్ కాదు. అయినప్పటికీ అది తారకరత్నదేనని నెటిజన్లు అంటున్నారు. ఒకవేళ ఈ న్యూస్ నిజమే అయితే మాత్రం.. మనం ఓ క్రేజీ హీరో-విలన్ కాంబోని వెండితెరపై చూడబోతున్నాం.
అవును.. తారకరత్న తన కెరీర్‌లో భారీ విజయాలేమీ సాధించలేదు. అతని కెరీర్ కూడా అంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. కానీ.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తన సత్తా చాటాడు. ముఖ్యంగా.. అమరావతిలో తాను కనబర్చిన అద్భుత ప్రతిభకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజా చెయ్యి వేస్తే సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. అందులో విలన్‌గా మాత్రం తనదైన ముద్ర వేశాడు. బహుశా అందుకేనేమో.. త్రివిక్రమ్ ఏరికోరి మరీ తారకరత్నను విలన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మహర్షి తర్వాత పూజా – మహేశ్ కలిసి నటించడం రెండోసారి.
అలాగే.. ఇది మహేశ్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న మూడో సినిమా. ఆల్రెడీ వీరి కాంబోలో అతడు, ఖలేజా లాంటి క్రేజీ సినిమాలొచ్చాయి. ఖలేజా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. దానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే, ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తారు. ఇప్పుడు వీరి కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతోంది కాబట్టి, దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.