నటనలోనే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు యన్.టి.రామారావు. ప్రపంచంలో మరెవ్వరూ చేయని విధంగా తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకోరాదని భావించారు యన్టీఆర్. దర్శకునిగా ఎవరి పేరూ వేయలేదంటే ‘ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించారు’ అని జనమే భావించాలని ఆశించారు. ఆ కారణంగానే యన్టీఆర్ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ (1961), రెండో సినిమా ‘గులేబకావళి కథ’ (1962)కు టైటిల్ కార్డ్స్ లో దర్శకునిగా పేరు…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే 26 ఏళ్ళయింది. అయినా ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్…