Perni Nani: నందమూరి బాలకృష్ణ, కామినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అని.. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కామినేనికి పట్టదు. కైకలూరులో దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదు.. ప్రజల కష్టాల గురించి…
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరగగా సినీ హీరోలు అందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరించారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలు అందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని…సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారని, దీనిపై చిరంజీవి…
సినిమాల్లో ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, వాస్తవ జీవితంలో నందమూరి బాలకృష్ణ గోల్డ్ అని అందరూ అంటుంటారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల ఆయన చూపే ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య గారు మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కవల కూతుళ్లు భూమి ఆరాధ్య,…
టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో…
Mirai: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల చేరువలోకి వచ్చేసింది. హిందీలో కూడా కలెక్షన్స్ జోరుగా సాగుతూ ఉండడంతో, మరిన్ని వసూళ్లు చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని తాజాగా నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. Dog Squad: గంజాయి రవాణా, సరఫరాకు…
Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…
నందమూరి బాలకృష్ణ, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వేదికపై గౌరవప్రదమైన గంటను మోగించి, దక్షిణ భారతదేశంలోనే తొలి నటుడిగా చరిత్రలో నిలిచారు. ఈ అరుదైన గౌరవం ఆయన కెరీర్లో ఒక కీలక అధ్యాయంగా మిగిలిపోనుంది. ఎన్ఎస్ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తన తల్లి స్మృతికి గౌరవంగా బాలకృష్ణ స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థ, ఆర్థికంగా…
పద్మభూషణ్ , దేశంలో మొదటి కళాకారుడుగా బుక్ ఆఫర్ రికార్డ్స్ లో స్థానం పొందడం.. వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నాను అన్నారు నందమూరి బాలకృష్ణ.. పదవులు నాకు ముఖ్యం కాదు... వాటికే నేను అలంకారమన్నది నా భావనగా అభివర్ణించారు.. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నాను అని వెల్లడించారు..
త్వరలో ఏపీలో మంత్రి, పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామనాయడు కుమార్తె వివాహం జరగనుంది. ఈ క్రమంలో ఆయన నందమూరి బాలకృష్ణను వివాహానికి ఆహ్యానించారు. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు. వస్తానని ఎలా వస్తానో చెప్పనని తెలిపారు. ఈ విషయాన్ని రామానాయుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. Also Read:Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది! ఈ మేరకు బాలకృష్ణను ఆహ్వానిస్తున్న వీడియో సైతం షేర్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్…
నందమూరి బాలకృష్ణ గురించి ఒకప్పటి యాంకర్ ఉదయభాను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె నటించిన బార్బెరిక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె Nటీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతాను కాబట్టి, ఎన్నో సమస్యలు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. నేను గతంలో నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పాను కాబట్టి, కొంతమంది గిరి గీసుకుని, నేను బాలకృష్ణ…