NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ (అఖండ సెకండ్ పార్ట్) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అప్పుడే మరో సినిమా కూడా మొదలుపెట్టేశారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నేడు ముహూర్తం పూజతో ప్రారంభమైంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఇక, ఈ సినిమా పూజ రోజునే అధికారికంగా అనౌన్స్ చేశారు.
READ MORE: Lalu Family Trouble: లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు..
“యుద్ధభూమి తన రాజుకి సెల్యూట్ చేసేందుకు వస్తోంది” అని అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా కథ ఇప్పటిది కాదేమో అని అనుమానాలు కలిగించేలా ఈ పోస్టర్ ఉంది. బాలకృష్ణ ఒక రాజు గెటప్‌లో, రెండు భిన్నమైన పాత్రలలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. నందమూరి బాలకృష్ణకు పీరియాడిక్/చారిత్రక సినిమాలు చాలా వరకు కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ ఉంటుందని ప్రచారం ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. మరి, అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.