బాలయ్య – బోయపాటిల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Also Read : Rajni 173 : రజనీ సినిమాకు సాయి అభ్యంకర్.. కోలీవుడ్ లో హాట్ టాపిక్
మరోవైపు ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. నిర్మాతలకు అడ్వాన్సులు కూడా భారీగా అందాయి. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ రాని కారణంగా సినిమా రిలీజ్ ఆగింది. ప్రస్తుతం ఫైనాన్స్ ఇష్యూ క్లియర్ అవడంతో రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 12 లేదా 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిర్మాతలతో రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజు హైదరాబాద్ లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఈ సినిమా కోసం తాము బయట వడ్డీకి డబ్బులు తెచుకున్నాము వారి నుండి మాకు వత్తిడి వుంది. త్వరగా రిలీజ్ డేట్ చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. తెలిసిన సమాచారం ప్రక్రారం 25న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు దాదాపు ఒప్పుకున్నారని కానీ ఆ డేట్ కు వస్తే బాగా ఇబ్బంది అవుతుందని ఓవర్సీస్, బెంగుళూరు డిస్ట్రిబ్యూటర్స్ అభ్యంతరం తెలుపుతున్నారట. అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరుగుతన్న ఈ చర్చలు సాయంత్రం ఓ కొలిక్కి వస్తాయేమో చూడాలి.