సంకాంత్రి అంటేనే కోళ్ల పందాలకు ఫేమస్.. ఎంతో హుషారుగా యువతతో పాటు స్థానిక ప్రముఖులు ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్లు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రాలో జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి మీకు తెలుసా? ఈవిషయం కొంత మందికి మాత్రమే తెలుసు.
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నల్గొండ జిల్లాలో ఆ సోదరులకు మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు.
కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు తాజాగా 700 దాటాయి. భాగ్యనగరంలోని నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. కాగా.. నార్కట్‌పల్లిలోని గురుకుల కళాశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి…
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెలిమినేడు, పేరేపల్లి, పిట్టంపల్లి, బొంగోనిచెరువు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దగ్గు వాంతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రియాక్టర్ నుంచి వెలువడిన విషవాయువుల గురించి…
తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్లలో ఆయనొకరు..నాలుగుసార్లు అసెంబ్లీకి వెళ్లినా,ఆయనకు దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.ఎప్పటికప్పుడు ఆ పదవి, ఈ పదవి అని ఊహాగానాలు తప్ప ఒరుగుతున్నదేమీలేదు..ఆఖరికి ఇంత హైప్ మీద కారెక్కిన తర్వాత..ఇంకా వెయిటింగ్ లిస్టు తప్పదా అనే టాక్ నడుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజకీయాల్లో దక్కిన పదవులు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఎనభైల్లోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఆలేరు…
ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు షర్మిల. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం…
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి వృత్తిలో ఉన్నాం.. ఎలాంటి పనులు చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. పోలీసులు, టీచర్లు, డాక్టర్లు ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండికూడా కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి దేవుడు నమ్మి చర్చికి వచ్చిన భక్తులను కూడా ఫాదర్ లు వదిలిపెట్టకపోవడం శోచనీయం. తాజాగా ఒక సిస్టర్ ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక ఫాదర్ మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ…
రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఈ పర్యటనలో అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఇక ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ కుమార్. మార్కెట్ లో…
నల్గొండ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన విలియమ్స్ అనే వ్యక్తి ఓ చర్చిలో పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే అదునుగా చర్చికి వచ్చే మహిళలను అతడు టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానంటూ వారి వెంట పడేవాడు. ఆ తర్వాత మహిళలను లోబరుచుకుని పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు అతడు 19 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. Read Also: పంజాగుట్ట పాప హత్య కేసులో…