తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పాదయాత్ర నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలో కొనసాగుతోంది. అయితే గురువారం చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో వైఎస్ షర్మిల బస చేస్తున్న క్యాంప్ సమీపంలో ఓ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం వైఎస్ షర్మిలకు తెలియడంతో ఆమె వెంటనే స్పందించి 108 వాహనానికి ఫోన్…
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. చిట్యాల పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాగా టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.4 కోట్ల నగదు పట్టుబడింది. దీంతో…
నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు…
ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోట. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించిన కామ్రేడ్స్‌కు ఈ ప్రాంతం అడ్డా. ఇప్పుడా వైభవం లేదు. ఉనికి కాపాడుకోవడానికే లెఫ్ట్ పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కమ్యూనిస్ట్‌లు ఖిల్లాలో ఎందుకీ దుస్థితి? ఎర్ర జెండా అలిసిందా? వెలిసిందా? లెట్స్ వాచ్! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రజెండా రెపరెపల్లేవ్! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభతోపాటు పలు అసెంబ్లీ…
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.. ఇక, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ దీక్షల పేరుతో వరుసగా దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఇకపై.. ప్రతీ మంగళవారం దీక్షలు చేయనున్నట్టు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది.. ఇక, ఇవాళ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ…
ఆ జిల్లాలో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నా.. సిబ్బందిలో మార్పు రావడం లేదట. అదేపనిగా ఆరోపణలు.. చర్యలు కామనైపోయాయి. ఒకప్పుడు చిన్న మెమో ఇస్తేనే గిల్టీగా ఫీలయ్యే సిబ్బంది.. ఇప్పుడు సస్పెండ్ చేసినా ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారు? నెలరోజుల వ్యవధిలోనే నలుగురిపై ఆరోపణలు! నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో పది స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న SIలు, CIలు, కానిస్టేబుళ్లపై ఏదో ఒక ఆరోపణలు రావడం.. వేటు పడటం ఈ మధ్య…