హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిమ్ బుధవారం తొలి ప్రసంగం చేశారు. మంగళవారమే హసన్ నస్రల్లా వారసుడిగా ఎన్నికయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో కాల్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే నడుచుకుంటానని ప్రకటించారు.
హమాస్‌కు కొత్త చీఫ్ వచ్చేశాడు. హమాస్ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత హమాస్‌కు కొత్త లీడర్ వస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా హత్యకు గురయ్యాడు.
హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.